వార్త ముఖ్యాంశాలు
- మొబైల్ ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శాంతి ఓకేషనల్ జూనియర్ కళాశాల మరియు మిరియం డిగ్రీ కళాశాల, అమలాపురం బస్టాండ్ ప్రాంతం, వై జంక్షన్ పేరూరు మరియు అమలాపురం గడియారస్తంభం కూడలి ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్…
- ప్రతాప్ కుమార్ తెలియజేశారు.
- జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ జి.
మొబైల్ ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శాంతి ఓకేషనల్ జూనియర్ కళాశాల మరియు మిరియం డిగ్రీ కళాశాల, అమలాపురం బస్టాండ్ ప్రాంతం, వై జంక్షన్ పేరూరు మరియు అమలాపురం గడియారస్తంభం కూడలి ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్ట మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ సహాకారంతో జనకళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య ప్రచార రథం ద్వారా దృశ్య శ్రవణ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు మరియు యువతకు ఆరోగ్య విషయాలు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాలపై అవగాహన నివారణ చర్యలు గురించి తెలియజేయడం కోసం ఏర్పాటు చేశారని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి ఐ సీటీసీ కౌన్సిర్లర్ కే. ప్రతాప్ కుమార్ తెలియజేశారు. జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను మాట్లాడుతూ లైంగికoగా సంక్రమించే వ్యాధులు మరియు కౌన్సిలింగ్ సేవలు మరియు స్థానిక హెచ్ ఐ వి పరీక్ష మరియు వివరాలు సేకరించి వారికీ దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమం కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ రాకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలు వాటి యొక్క ప్రమాద పరిస్థితులు పై తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనకళ్యణ్ వెల్ఫేర్ సోసైటీ ప్రాజెక్ట్ సిబ్బంది కుంచె శ్రీనివాస్, పీఠం ఎడ్యుకేటర్ గుర్రాల అమల మరియు మిరియం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తమేశ్వరరావు, అధిక సంఖ్యలో ప్రజానీకం ,విద్యార్థులు వీక్షించడం జరిగింది.