Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అన్నదేవరపేట శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదేవరపేట శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లపూడి, తూర్పుగోదావరి (జిల్లా పున్నమి ప్రతినిధి) మే 15:తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో గల శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి రూ.80 లక్షలు మంజూరు చేయడంతో టిడిపి యువ నాయకుడు అల్లూరి విక్రమాదిత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి…
  • విక్రమాదిత్య విజ్ఞప్తి మేరకు ఈ నిధులు మంజూరైనట్లు సమాచారం.
  • ఈ సందర్భంగా అన్నదేవరపేటలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి కూడా సహకరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

తాళ్లపూడి, తూర్పుగోదావరి (జిల్లా పున్నమి ప్రతినిధి) మే 15:తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో గల శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ ధర్మదాయ శాఖ నుంచి రూ.80 లక్షలు మంజూరు చేయడంతో టిడిపి యువ నాయకుడు అల్లూరి విక్రమాదిత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
విక్రమాదిత్య విజ్ఞప్తి మేరకు ఈ నిధులు మంజూరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా అన్నదేవరపేటలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి కూడా సహకరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, రానున్న పుష్కరాల సందర్భంగా దేవాలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి ఆలయ అర్చకులు పెద్దింటి శ్యామ్, పెద్దింటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *