Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమతులు లేకుండా 74 రకాల మందుల విక్రయం.. ఆర్ఎంపీ వైద్యురాలికి జైలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుమతులు లేకుండా 74 రకాల మందుల విక్రయం.. ఆర్ఎంపీ వైద్యురాలికి జైలు

వార్త ముఖ్యాంశాలు

  • కోవూరు: ఎలాంటి లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా మందులు విక్రయించిన ఆర్ఎంపీ వైద్యురాలికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది.
  • అంతేకాకుండా రూ.20 వేల జరిమానా కూడా విధిస్తూ మేజిస్ట్రేట్ శివనమ్రత శుక్రవారం తీర్పు చెప్పారు.కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో 2018 ఆగస్టు 4న ఆర్ఎంపీ వైద్యురాలు సుమలత అనుమతులు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి గుర్తించారు.
  • అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి మందులను స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో మందులు సరఫరా చేసిన నెల్లూరుకు చెందిన ఎన్.

కోవూరు: ఎలాంటి లైసెన్సులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా మందులు విక్రయించిన ఆర్ఎంపీ వైద్యురాలికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.20 వేల జరిమానా కూడా విధిస్తూ మేజిస్ట్రేట్ శివనమ్రత శుక్రవారం తీర్పు చెప్పారు.కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో 2018 ఆగస్టు 4న ఆర్ఎంపీ వైద్యురాలు సుమలత అనుమతులు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి గుర్తించారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి మందులను స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో మందులు సరఫరా చేసిన నెల్లూరుకు చెందిన ఎన్. సత్యనారాయణ, సత్యనారాయణ ఎంటర్‌ప్రైజెస్ యజమాని సత్యనారాయణ, వరసిద్ధి వినాయక మెడికల్ ఏజెన్సీ యజమాని శిల్పలపై కూడా కేసులు నమోదయ్యాయి.విచారణ సందర్భంగా సుమలత ఎలాంటి లైసెన్సులు లేకుండా 74 రకాల మందులను విక్రయించినట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆధారాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *