Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

అనుప్పల్లి హౌసింగ్ లేఅవుట్ లో వేగంగా మౌలిక సదుపాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుప్పల్లి హౌసింగ్ లేఅవుట్ లో వేగంగా మౌలిక సదుపాయాలు

లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

చిత్తూరు,ఆగస్టు ,06 (పున్నమి ప్రతినిధి)

చిత్తూరు నగరపాలక పరిధిలోని అనుప్పల్లి హౌసింగ్ లేఅవుట్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనుప్పల్లి లేఅవుట్ ను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. లేఔట్ లో ఎన్ని పట్టాలు మంజూరు చేశారు? ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి! అసంపూర్తి నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఎన్ని అనే అంశాలపై హౌసింగ్, రెవిన్యూ అధికారులతో సమీక్షించారు. ఇంటి పట్టాలు పొంది ఇంకా నిర్మాణాలు చేపట్టిన వారిని, అనర్హులను గుర్తించాలన్నారు. లేఅవుట్ లో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మాణానికి సత్వరం చర్యలు ప్రారంభించాలని, స్ట్రీట్ లైట్లు వేగంగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీధర్, అర్బన్ తాహసీల్దారు తులసీరామ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అనుప్పల్లి హౌసింగ్ లేఅవుట్ లో వేగంగా మౌలిక సదుపాయాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *