వార్త ముఖ్యాంశాలు
- Pబీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 31న అనకాపల్లిలో నిర్వహించనున్న సంచార, అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవానికి పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్ కు ఆహ్వానం అందించారు.
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో సంచార జాతులను గుర్తించి వారికి గౌరవం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు.
- సంచార జాతులకు స్థిర నివాసం, విద్యా అవకాశాలు కల్పించి వారి కలలకు గుర్తింపు తేవాలని కోరారు.
Pబీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 31న అనకాపల్లిలో నిర్వహించనున్న సంచార, అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవానికి పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్ కు ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో సంచార జాతులను గుర్తించి వారికి గౌరవం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. సంచార జాతులకు స్థిర నివాసం, విద్యా అవకాశాలు కల్పించి వారి కలలకు గుర్తింపు తేవాలని కోరారు.
ఈ నెల 31న సోమవారం అనకాపల్లి రావు గోపాలరావు కళాక్షేత్రంలో “సంచార జాతులు – స్ఫూర్తి, సంస్కృతి వారసులు” పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ సంచార జాతుల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు, మంత్రులు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ పాల్గొననున్నారు.