Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి దళితసేన ఆర్థిక సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి దళితసేన ఆర్థిక సహాయం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన పోతాబత్తుల నరసింహరావు కుమార్తె కొప్పడి శివగంగ కుటుంబానికి దళితసేన అండగా నిలిచింది. ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శివగంగ నివాసం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురించి స్థానిక దళితసేన సభ్యుల ద్వారా తెలుసుకున్న దళితసేన గ్రూప్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10,500 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని దళితసేన సభ్యులు తెలిపారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి తోడుగా నిలిచిన దళితసేన సభ్యులకు స్థానికులు అభినందనలు తెలిపారు.

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి దళితసేన ఆర్థిక సహాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *