Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌ మండలంలోని సింగనమాల వీధికి చెందిన ఓ కుటుంబం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు, ఇంట్లోని విలువైన సామగ్రిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాజుగుంటకు చెందిన గుత్తి నరసింహ, నానబాల నాగార్జున బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
  • ప్రమాదంలో జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారు.
  • ఇంటిని తిరిగి వినియోగించుకునేందుకు అవసరమైన వివిధ వస్తువులను సమకూర్చి బాధిత కుటుంబానికి అందజేశారు.

చిట్వేల్‌ మండలంలోని సింగనమాల వీధికి చెందిన ఓ కుటుంబం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు, ఇంట్లోని విలువైన సామగ్రిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాజుగుంటకు చెందిన గుత్తి నరసింహ, నానబాల నాగార్జున బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారు. ఇంటిని తిరిగి వినియోగించుకునేందుకు అవసరమైన వివిధ వస్తువులను సమకూర్చి బాధిత కుటుంబానికి అందజేశారు. కష్ట సమయంలో తమను పరామర్శించి, ఇంటికి అవసరమైన సామగ్రిని అందించిన గుత్తి నరసింహ, నానబాల నాగార్జునకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందించిన వారిని స్థానికులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *