Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

అక్టోబర్ 3న సోమల నరేపాని కొండ చుట్టూ తిరుమల శనివారాల గిరి ప్రదక్షిణ మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అక్టోబర్ 3న సోమల నరేపాని కొండ చుట్టూ తిరుమల శనివారాల గిరి ప్రదక్షిణ మహోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • సోమల: తిరుమల శనివారాల పురస్కరించుకుని అక్టోబర్ 3వ తేదీ శనివారం నాడు సోమల మండల కేంద్రంలోని నరేపాని కొండ చుట్టూ భక్తుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
  • శనివారం ఉదయం 9:00 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
  • ​ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ: ఈ కార్యక్రమం అత్యంత విశేషంగా శ్రీవారి ఉత్సవ మూర్తులతో కొండ చుట్టూ సాగనుండటం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ.

సోమల:
తిరుమల శనివారాల పురస్కరించుకుని అక్టోబర్ 3వ తేదీ శనివారం నాడు సోమల మండల కేంద్రంలోని నరేపాని కొండ చుట్టూ భక్తుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9:00 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
​ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ:
ఈ కార్యక్రమం అత్యంత విశేషంగా శ్రీవారి ఉత్సవ మూర్తులతో కొండ చుట్టూ సాగనుండటం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారి ఉత్సవ మూర్తుల వెంట నడుస్తూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అనంతరం మధ్యాహ్నం విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *