Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ లో ప్రతిభని చాటిన శ్రీకాళహస్తి మహిళ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ లో ప్రతిభని చాటిన శ్రీకాళహస్తి మహిళ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని మల్లాపు స్వర్ణలత మలేషియాలోని కౌలాలంపూర్ లో పిబ్రవరి నెల 27 నుండి మార్చి 04 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సీరియస్ లో…
  • టెస్ట్ సిరీస్ లో స్వర్ణలత తన ప్రతిభను చాటి జట్టు గెలుపునకు కృషి చేసింది.
  • టెస్ట్ సిరీస్ లో భారతదేశపు జట్టు ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించింది.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని మల్లాపు స్వర్ణలత మలేషియాలోని కౌలాలంపూర్ లో పిబ్రవరి నెల 27 నుండి మార్చి 04 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సీరియస్ లో భారతదేశం తరుపున బి.బి.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జట్లు పాల్గొనడంతో మహిళా జట్టులో శ్రీకాళహస్తి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని మల్లాపు స్వర్ణలత ప్రాతినిధ్యం వహించారు. టెస్ట్ సిరీస్ లో స్వర్ణలత తన ప్రతిభను చాటి జట్టు గెలుపునకు కృషి చేసింది. టెస్ట్ సిరీస్ లో భారతదేశపు జట్టు ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంతటి విజియాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడా కారిణిని స్వర్ణలతను శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్, పిడి నరసింహారావు, సీనియర్ ప్లేయర్ ప్రభాకర్, కోచ్ క్రాంతి కుమార్, లు సత్కారచి అభినందనలు తెలిపారు. అనంతరం చిత్తూరు జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ, రాష్ట్ర బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినా పసుపులేటి బాలాజి చిత్తూరు జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ C. వెంకటస్వామి హర్షం వెక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *