Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అంగన్ మిలన్ సేవ సంకల్ప అభియాన్‌లో పోషకాహారం, ప్రజారోగ్యంపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంగన్ మిలన్ సేవ సంకల్ప అభియాన్‌లో పోషకాహారం, ప్రజారోగ్యంపై అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని లోకేశ్వరం మండలంలో బీజేపీ మహిళా మోర్చా ఇన్‌చార్జ్ నల్లుల సంగీత ఆధ్వర్యంలో బుధవారం “అంగన్ మిలన్ సేవ సంకల్ప అభియాన్” కార్యక్రమాన్ని తోకల సరస్వతి నిర్వహించారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు.
  • ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, గర్భిణుల్లో పోషకాహారం ప్రాధాన్యతతో పాటు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు.

నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని లోకేశ్వరం మండలంలో బీజేపీ మహిళా మోర్చా ఇన్‌చార్జ్ నల్లుల సంగీత ఆధ్వర్యంలో బుధవారం “అంగన్ మిలన్ సేవ సంకల్ప అభియాన్” కార్యక్రమాన్ని తోకల సరస్వతి నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, గర్భిణుల్లో పోషకాహారం ప్రాధాన్యతతో పాటు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పాత్రపై వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CDPO హాజరై మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మీనా, అంగన్వాడీ టీచర్లను తోకల సరస్వతి సన్మానించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ మీనా, తోకల సరస్వతి,
అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *