Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పింఛన్‌కు కుల ధ్రువీకరణ అవసరమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గన్నవరపు శ్రీనివాసరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పింఛన్‌కు కుల ధ్రువీకరణ అవసరమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గన్నవరపు శ్రీనివాసరావు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం : వృద్ధాప్య పింఛన్లకు కుల ధ్రువీకరణ పత్రాలు ఎందుకు అవసరమని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
  • BCలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటే వయస్సుతో పాటు కుల నిర్ధారణ అవసరం కావచ్చని, అయితే SC, ST, OC వృద్ధులకు ఆధార్‌లోని వయస్సు ఆధారంగా పింఛన్ ఇవ్వవచ్చని అన్నారు.
  • వృద్ధులకు పింఛన్ ఇవ్వడంలో కులాల వారీగా విభజన ఎందుకని ప్రశ్నించారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం :
వృద్ధాప్య పింఛన్లకు కుల ధ్రువీకరణ పత్రాలు ఎందుకు అవసరమని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. BCలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటే వయస్సుతో పాటు కుల నిర్ధారణ అవసరం కావచ్చని, అయితే SC, ST, OC వృద్ధులకు ఆధార్‌లోని వయస్సు ఆధారంగా పింఛన్ ఇవ్వవచ్చని అన్నారు. వృద్ధులకు పింఛన్ ఇవ్వడంలో కులాల వారీగా విభజన ఎందుకని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలు, 688 మండలాలు, 16,862 గ్రామాల్లో సగటున గ్రామానికి 100 దరఖాస్తులు వస్తే సుమారు 16,86,200 మంది అవుతారని, వీరందరికీ పింఛన్లు అమలు చేస్తారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతోందా అని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *