Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

*విశాఖ క్వీన్ మేరీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*విశాఖ క్వీన్ మేరీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక!*

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం, డిసెంబర్, 12: విశాఖపట్నం పాత పట్నం పాటపట్నం క్వీన్ మేరీ హై స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులంతా నగరంలో ఆర్ కె బీచ్ తీరాన ఓ ప్రముఖహోటల్ లో కలసి సందడి చేసారు.
  • ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము,చదువుల చెట్టు నీడలో అంటూ 1968 సం లో క్వీన్ మేరీ హైస్కూల్ లో చదివిన పూర్వ విద్యార్ధులు 15 మందీ ..
  • అందరూ ఓ చోటచేరిన తమ ఆత్మీయ కలయిక వారి జీవితాల్లో మధుర ఘట్టంగానిలిచిపోయింది.

విశాఖపట్నం, డిసెంబర్, 12:

విశాఖపట్నం పాత పట్నం పాటపట్నం క్వీన్ మేరీ హై స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులంతా నగరంలో ఆర్ కె బీచ్ తీరాన ఓ ప్రముఖహోటల్ లో కలసి సందడి చేసారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము,చదువుల చెట్టు నీడలో అంటూ 1968 సం లో క్వీన్ మేరీ హైస్కూల్ లో చదివిన పూర్వ విద్యార్ధులు 15 మందీ .. అందరూ ఓ చోటచేరిన తమ ఆత్మీయ కలయిక వారి జీవితాల్లో మధుర ఘట్టంగానిలిచిపోయింది.
పూర్వ విద్యార్థులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆట,పాటలతో
మైమరచిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకేచోట తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ యోగక్షే మాల అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బెంగులూరు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వైద్య తదితర ఉద్యోగాలలో స్ధిరపడి, రిటైర్ట్ అయిన ఉద్యోగులు కూడా ఈ ఆత్మీయ కలయికలో పాల్గోని మధురానుభూతిని పొందారు. ఈ సందర్బంగా బాలభాను విద్యాలయం ట్రస్టీ, క్వీన్ మేరీ హై స్కూల్ పూర్వ విద్యార్థిని వారణాసి పార్వతి మాట్లాడుతూ అమెరికా నుంచి గొల్లపూడి లక్ష్మి రాక సందర్బంగా తామంతా
కలిశామని, ఇప్పటి వరకూ 8 సార్లు కలిసి తమ జ్నాపకాలను గుర్తు చేసుకున్నామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *