Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదల సేవలో కార్యక్రమంలో యువనేత రామకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పేదల సేవలో కార్యక్రమంలో యువనేత రామకృష్ణ

మండలంలోని తన స్వగ్రామo మైన తూర్పు రొంపి దొడ్ల గ్రామ పంచాయతీ లో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మార్నేని రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని అందులో భాగంగానే పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఒకటో తారీఖున అనేక రకాల పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం అందిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

పేదల సేవలో కార్యక్రమంలో యువనేత రామకృష్ణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *