వార్త ముఖ్యాంశాలు
- రైల్వేకోడూరు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా రైల్వేకోడూరులో సోమవారం అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- పగడాలపల్లి, జీటీ కాలనీ, గాండ్లవీధి, అంకమ్మనగర్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తు చేసుకున్నారు.
- బీజేపీ తిరుపతి మహిళా మోర్చా కార్యదర్శి మావిళ్ల జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రైల్వేకోడూరు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా రైల్వేకోడూరులో సోమవారం అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పగడాలపల్లి, జీటీ కాలనీ, గాండ్లవీధి, అంకమ్మనగర్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తు చేసుకున్నారు.
బీజేపీ తిరుపతి మహిళా మోర్చా కార్యదర్శి మావిళ్ల జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సేవలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైల్వేకోడూరు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మలాదేవితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమంలో పేర్కొన్నారు. గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కుప్పాల కిరణ్‌కుమార్, కాలప్పగారి రాము తదితరులు పాల్గొన్నారు.