Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సింహాచలం దేవస్థానంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి – పాశ్చాత్య దుస్తులతో వచ్చే వారికి అనుమతి నిరాకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సింహాచలం దేవస్థానంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి – పాశ్చాత్య దుస్తులతో వచ్చే వారికి అనుమతి నిరాకరణ

సింహాచలం (పున్నమి ప్రతినిధి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో భక్తులు సంప్రదాయ వస్త్రధారణకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవస్థానం అధికారులు సూచించారు. ముఖ్యంగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేశారు.

పురుషులు ధోవతి, అంగవస్త్రం లేదా కుర్తా పైజామా ధరించాలని, మహిళలు చీర, లంగా వోణీ లేదా దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించాలని సూచించారు. షర్ట్, ప్యాంట్ వంటి ఆధునిక దుస్తులతో పాటు టీషర్ట్, జీన్స్, ఇతర పాశ్చాత్య వస్త్రధారణలో వచ్చే భక్తులను దేవస్థానం ఆవరణలోకి అనుమతించబోమని పేర్కొన్నారు.

పిల్లలు, పెద్ద పిల్లలు సైతం సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. దేవస్థాన పవిత్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడటంలో భాగంగా ఈ వస్త్రధారణ నిబంధనలను పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

సింహాచలం దేవస్థానంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి – పాశ్చాత్య దుస్తులతో వచ్చే వారికి అనుమతి నిరాకరణ

సింహాచలం దేవస్థానంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి – పాశ్చాత్య దుస్తులతో వచ్చే వారికి అనుమతి నిరాకరణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *