Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జగిత్యాల

వెంకటాపూర్ లో మహిళ నిరాహార దీక్ష ఆడపిల్ల పుట్టిందని వేధింపులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు ఇంటికి తాళాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకటాపూర్ లో మహిళ నిరాహార దీక్ష ఆడపిల్ల పుట్టిందని వేధింపులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు ఇంటికి తాళాలు

వార్త ముఖ్యాంశాలు

  • కోరుట్ల / జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో అత్తగారి ఇంటి గేటు ముందు ఓ మహిళ ఆదివారం నిరహార దీక్షకు దిగింది.
  • ఆమె రాకను గమనించిన భర్త బర్కమ్ గణేష్, అత్త బర్కమ్ రాజు, మామ బర్కమ్ గంగాధర్, మరిది బర్కమ్ ప్రణీత్ లు ఇంటికి, గేటుకు తాళాలు వేసి పారిపోయారని బాధితురాలు బర్కమ్ అరుణ ఆరోపిస్తోంది.
  • ఆమె కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోరుట్ల / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో అత్తగారి ఇంటి గేటు ముందు ఓ మహిళ ఆదివారం నిరహార దీక్షకు దిగింది. ఆమె రాకను గమనించిన భర్త బర్కమ్ గణేష్, అత్త బర్కమ్ రాజు, మామ బర్కమ్ గంగాధర్, మరిది బర్కమ్ ప్రణీత్ లు ఇంటికి, గేటుకు తాళాలు వేసి పారిపోయారని బాధితురాలు బర్కమ్ అరుణ ఆరోపిస్తోంది. ఆమె కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గారం మండలం గోపులాపూర్ కు చెందిన గోవిందుల అరుణ అలియాస్ బర్కమ్ అరుణ కు వెంకటాపూర్ కు చెందిన బర్కమ్ గణేష్ తో 2023 ఆగస్ట్ 31న వివాహం జరిగింది. పెండ్లి సమయంలో ఆమె తల్లిదండ్రులు 14 తులాల బంగారం, నాలుగు లక్షల రూపాయలు నగదు, లాంఛనాల ప్రకారం ఇతర సామగ్రి అప్పగించారు. వీరికి హారిక అనే కూతురు జన్మించగా ఆడబిడ్డ పుట్టిందని, వేధింపులకు గురిచేశారు. మీ తల్లిదండ్రులను ఇంకా అదనపు కట్నం ఇవ్వుమని అడగాలని ఆడ పిల్ల పుట్టిన నాటి నుండి అరుణ ను భర్త, అత్త, మామ, మరిది చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె ఆరోపిస్తోంది. పలు సార్లు, అరుణ ను, ఆమె తల్లి గోవిందుల పద్మను సైతం గతంలో కొట్టి రక్తగాయాల పాలు చేశారని అరుణ ఆరోపిస్తోంది. బిడ్డ పుట్టిన నాటి నుండి నేటి వరకు బిడ్డను, తల్లిని ఇంటికి రాకుండా అనేక రకాల హింసలు పెట్టినట్లు, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన 14 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు రూపాయలు కూడా ఇవ్వకుండా అత్త – మామలు బర్కమ్ రాజు – బర్కమ్ గంగాధర్ లు కాజేశారని అరుణ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలనీ, ఇటీవలే అరుణ తండ్రి విదేశాలలో చనిపోయారని, అప్పుల పాలు అయ్యామని, బిడ్డను సాధలేక, పసి బిడ్డతో తాను ఏ పని చేసుకోలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాననని అరుణ తెలిపింది.
అనేక సార్లు పలువురు పెద్ద మనుషులతో కలిసి వెళ్ళి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలనీ, మమ్ములను ఇంట్లోకి అనుమతించి సాధాలని ఎంత బ్రతిమిలాడినా భర్త, అత్త – మామ, మరిది సాగనీయడం లేదని అరుణ ఆరోపిస్తోంది. కనీసం నా తల్లిదండ్రులు పెట్టిన 14 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు రూపాయలు ఇచ్చినా తన బిడ్డను తాను సాధుకొని బ్రతుకు తానని ఎంత బ్రతిమిలాడినా మామ గంగాధర్, అత్త రాజు, భర్త గణేష్, మరిది ప్రణీత్ లు కనికరించడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను, తన బిడ్డ అనారోగ్యాల పాలు అయినా భర్త , అత్త మామలు పట్టించు కోవడం లేదని అరుణ కన్నీరు – మున్నీరుగా విలపిస్తోంది.

ఇప్పటికైనా తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని అరుణ వేసుకుంటుంది. తన, తన బిడ్డ హారిక భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగేంత వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష విడిచేది లేదని అరుణ పేర్కొంది.
గత రెండున్నర ఏండ్లుగా అనేక ఇబ్బందులు, నరక యాతన అనుభవిస్తున్నట్లు అరుణ ఆరోపిస్తోంది.

వార్తా మూలాలు

  • అరుణ - బాధితురాలుపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *