వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక) పాపయ్యపేట గ్రామ శివారులోని వాగు కారణంగా రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని రెండు రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్సీ నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ…
- రైతుల సమస్యపై తక్షణమే స్పందించిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో.
- ఈ రోజు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారి ఆధ్వర్యంలో వాగుపై మోరీల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.
చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక)
పాపయ్యపేట గ్రామ శివారులోని వాగు కారణంగా రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని రెండు రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్సీ నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి స్థానిక సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పార్టీ నాయకులు రైతులు తీసుకెళ్లి వాగుపై మోరీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యపై తక్షణమే స్పందించిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో.
ఈ రోజు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గారి ఆధ్వర్యంలో వాగుపై మోరీల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. దీంతో రైతులకు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.
గౌరవ మాజీ శాసనసభ్యులు ఉద్యమ నేత నర్సంపేట అభివృద్ధి ప్రదాత మన అభిమాన నాయకులు స్వర్గీయ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చూపిన ప్రజాసేవా స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు
ఈ సందర్భంగా రైతులు గ్రామ ప్రజలు తమ సమస్యను గుర్తించి తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో: మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్. మండల కోశాధికారి గుర్రం రవి. గ్రామ పార్టీ అధ్యక్షులు మొర్రి కట్టయ్య. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్. బండి రమేష్ . సుధాకర్. బర్ల యాకయ్య. ఏజిపి కొమురయ్య.మొర్రి కుమార్ స్వామి. శ్రీను.మారపర వీరస్వామి.గ్రామ ప్రజలు .రైతులు .పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన