వార్త ముఖ్యాంశాలు
- జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.
- తాను సిఫార్సు చేసిన పని చేయని ఓ అధికారి, సంబంధిత వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే పూర్తి చేశారని పేర్కొన్నారు.
- అధికారుల లంచాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. తాను సిఫార్సు చేసిన పని చేయని ఓ అధికారి, సంబంధిత వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే పూర్తి చేశారని పేర్కొన్నారు. అధికారుల లంచాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమిషన్లు డిమాండ్ చేస్తుండటంతో వారు పనులు వదిలి వెళ్లిపోతున్నారని ఆరోపించారు.