Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

యువత ప్రతిభకు యువజన ఉత్సవాలు చక్కని వేదిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యువత ప్రతిభకు యువజన ఉత్సవాలు చక్కని వేదిక

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
  • ముఖ్య అతిథిగా కలెక్టర్ టి.
  • నిశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ టి. నిశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ఉత్సవాలు చక్కని వేదికలని తెలిపారు. జానపద గేయాలు, నృత్యాలు, వీధి నాటకం, పెయింటింగ్, కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈఓ ఎం. రమ్య, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఇతర మూలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *