సబ్జపాడులో మండపల్లి కాంతమ్మ భౌతికకాయానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు నివాళులు.
మైలవరం మండలం చండ్రగూడెం పంచాయతీ పరిధిలోని శివారు గ్రామమైన సబ్జపాడులో మండపల్లి జమలయ్య గారి తల్లి కాంతమ్మ గారు వృద్ధాప్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు బుధవారం రాత్రి సబ్జపాడులోని ఆమె నివాసానికి వెళ్లారు. కాంతమ్మ గారి భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, కాంతమ్మ గారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కాంతమ్మ గారికి అంతిమ నివాళులర్పించారు.

