వార్త ముఖ్యాంశాలు
- తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 10: తొట్టంబేడు మండలం ఎన్ హెచ్–7 జాతీయ రహదారి మల్లిగుంట రోడ్డు వద్ద టమోటా లోడ్‌తో అతివేగంగా వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ టైరు పగలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
- వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.
- ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 10: తొట్టంబేడు మండలం ఎన్ హెచ్–7 జాతీయ రహదారి మల్లిగుంట రోడ్డు వద్ద టమోటా లోడ్‌తో అతివేగంగా వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ టైరు పగలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను సవ్యంగా సాగేటట్లు చేశారు.