Wednesday, 9 September 2026
  • Home  
  • మంత్లీ సేఫ్టీ రివ్యూ సమావేశం
- జయశంకర్ భూపాలపల్లి

మంత్లీ సేఫ్టీ రివ్యూ సమావేశం

తేదీ :26-08-2026 బుధవారం రోజున భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మంత్లీ సేఫ్టీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీ మాటూరి రవీందర్ గారు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను అధికారులు జీఎం గారి దృష్టికి తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జీఎం శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ… ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని, విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి వాటిని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగులు వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని, గనుల్లో సేఫ్టీ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉద్యోగులకు నిరంతరం సేఫ్టీ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. సేఫ్టీ విషయంలో ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, “భద్రతే ప్రధానం” అనే భావనతో విధులు నిర్వహించాలని జీఎం పేర్కొన్నారు. సమావేశంలో భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏరియా ఇంజనీర్ సంభ శివ రావు, సెక్యూరిటి ఆఫీసర్ ,మురళి మోహన్,జి‌వి‌టి‌వి మేనేజర్ నజీర్, సేఫ్టీ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. u

తేదీ :26-08-2026 బుధవారం రోజున భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మంత్లీ సేఫ్టీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీ మాటూరి రవీందర్ గారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను అధికారులు జీఎం గారి దృష్టికి తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

జీఎం శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ… ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని, విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి వాటిని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉద్యోగులు వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని, గనుల్లో సేఫ్టీ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉద్యోగులకు నిరంతరం సేఫ్టీ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

సేఫ్టీ విషయంలో ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, “భద్రతే ప్రధానం” అనే భావనతో విధులు నిర్వహించాలని జీఎం పేర్కొన్నారు. సమావేశంలో భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఏరియా ఇంజనీర్ సంభ శివ రావు, సెక్యూరిటి ఆఫీసర్ ,మురళి మోహన్,జి‌వి‌టి‌వి మేనేజర్ నజీర్, సేఫ్టీ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
u

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.