ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రక్త వర్గ నిర్ధారణ కార్యక్రమం
విజయవాడ, సెప్టెంబర్ 29, 2026:
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రక్త వర్గ నిర్ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థుల్లో గుండె ఆరోగ్యం, రక్త వర్గాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్త వర్గాన్ని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ద్వితీయ సంవత్సరం B.Sc. Hons Zoology మరియు తృతీయ సంవత్సరం B.Sc. Hons Aquaculture విద్యార్థులు రక్త వర్గ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. A, B, AB, O రక్త వర్గాలతో పాటు Rh పాజిటివ్, Rh నెగెటివ్ రక్త వర్గాలను గుర్తించే విధానాన్ని ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రయోగాత్మకంగా అన్వయించుకున్నారు. రక్తదానం, అత్యవసర సమయాల్లో రక్త వర్గం ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇన్‌చార్జి డా. పి.వి. దుర్గావతి మరియు జంతుశాస్త్ర విభాగాధిపతి డా. ఆర్. రమణి కార్యక్రమాన్ని అభినందించారు. డా. ఎ. కల్యాణి, శ్రీమతి ఐ. అనిత హేమశ్రీ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
“మీ రక్త వర్గాన్ని తెలుసుకోండి – మీ హృదయాన్ని కాపాడుకోండి, ప్రతి రక్తపు బొట్టూ అమూల్యమే!” అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించారు.



