Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

ఖానాపురం, పున్నమి ప్రతినిధి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ఖానాపురం మండలానికి చెందిన 505 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర అర్హులైన వారికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఖానాపురం మండలంలో ఇప్పటికే మొత్తం 4,900 పింఛన్లు మంజూరయ్యాయని, మరో 400 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని వెల్లడించారు. పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, బుధరావుపేట సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్ రెడ్డి. ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్. ఉపసర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *