వార్త ముఖ్యాంశాలు
- బ్రిడ్జి వద్ద భారీ గ్యాప్..
- వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి కూసుమంచి: మండల పరిధిలోని పాలేరు కట్టపై ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- హైదరాబాద్–విజయవాడ మార్గంలో నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
బ్రిడ్జి వద్ద భారీ గ్యాప్.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
కూసుమంచి: మండల పరిధిలోని పాలేరు కట్టపై ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ మార్గంలో నిత్యం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
పాలేరు కాలువ బ్రిడ్జి వద్ద ఏర్పడిన భారీ గ్యాప్‌తో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బ్రిడ్జి వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.