Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరులో టీడీపీ కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరులో టీడీపీ కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి ): ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పామూరులోని శేషమహల్‌ ప్రాంగణంలో టీడీపీ కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు.
  • 1వ ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలోని 1, 2, 3, 4 వార్డులకు చెందిన కుటుంబ సాధికారిక సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
  • పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై సమావేశం నిర్వహించారు.

పామూరు, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి ): ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పామూరులోని శేషమహల్‌ ప్రాంగణంలో టీడీపీ కుటుంబ సాధికారిక సభ్యుల సమావేశం నిర్వహించారు. 1వ ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలోని 1, 2, 3, 4 వార్డులకు చెందిన కుటుంబ సాధికారిక సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ సర్పంచ్ సోమిశెట్టి వెంకటనారాయణ, మాజీ పట్టణ ఉపసర్పంచ్ యాదల సాయికిరణ్, క్లస్టర్ ఇన్‌చార్జులు ఆడుసుమల్లి ప్రభాకర్‌రావు, గుంటుపల్లి శ్రీనివాసులు, సింగిల్‌ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు, యూనిట్‌ ఇన్‌చార్జులు ఇర్రి శ్రీనివాసులురెడ్డి, కొండిశెట్టి రమణయ్య, జనసేన పార్టీ నాయకుడు వై. రహీముల్లా, వార్డు ఇన్‌చార్జులు తోట రవికుమార్, మండ్ల రమణయ్య, మొగుళ్లూరి మధు, బత్తుల నాగేశ్వరరావుతో పాటు మండల, పట్టణ టీడీపీ నాయకులు, టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా విభాగం నాయకులు, నాలుగు వార్డుల కుటుంబ సాధికారిక సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *