వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
గాజువాక: తొమ్మిది నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు బీజేపీ సీనియర్ నేత బాలాజీ అండగా నిలిచారు. మహిళల ఆవేదనను గుర్తించి, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు చొరవ చూపడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాజువాక సమీపంలోని విశాఖ డెయిరీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు నెలల తరబడి తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరం నుంచి బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యపై స్పందించిన బాలాజీ స్థానికులకు అండగా నిలిచి, నీటి సరఫరా పునరుద్ధరణ కోసం ప్రయత్నించారు. ఆయన స్పందించిన 24 గంటల్లో నీరు సరఫరా కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే, ఆ తర్వాత మళ్లీ నీటి సరఫరా నిలిచిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రజల తాగునీటి కష్టాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:
