భూపాలపల్లి, ఆగస్టు 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి డాక్టర్ కీర్తిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, 4వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:



