Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు ధన్యవాదాలు తెలిపిన దారపనేని, చెనికల

-తూర్పు కోడిగుడ్లపాడు రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు

-శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం

-ఎమ్మెల్యే చొరవతో గ్రామ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం

పామూరు, అక్టోబర్ 3(పున్నమి ప్రతినిధి): పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన అనంతరం పనులను ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పోతవరం టీడీపీ నాయకులు చెనికల చిన్న మాలకొండయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేసిన వెంటనే పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న కృషికి తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను వెంటనే ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి కానుకగా అందిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు టీడీపీ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, జంగాలపల్లి టీడీపీ నాయకులు మానం మల్లికార్జున యాదవ్, పోతవరం టీడీపీ నాయకులు మిరియం సుబ్బరాయుడు, మిరియం గురువయ్య, గడిపూటి వెంకటేశ్వరరావు, తిరివీధి చంద్ర, తిరివీధి హజరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *