వార్త ముఖ్యాంశాలు
- *ఉమ్మడి చెర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం* *మారుతి ఎంక్లేవ్‌లో రూ.22 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన* *నాగార్జున నగర్ రోడ్ పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* ఉమ్మడి చెర్లపల్లి డివిజన్ పరిధిలోని మారుతి ఎంక్లేవ్‌లో స్థానిక ప్రజల సౌకర్యార్థం రూ.22 లక్షల…
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, చిన్నారులు, వృద్ధులు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
- పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
*ఉమ్మడి చెర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం*
*మారుతి ఎంక్లేవ్‌లో రూ.22 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన*
*నాగార్జున నగర్ రోడ్ పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*
ఉమ్మడి చెర్లపల్లి డివిజన్ పరిధిలోని మారుతి ఎంక్లేవ్‌లో స్థానిక ప్రజల సౌకర్యార్థం రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, చిన్నారులు, వృద్ధులు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం నాగార్జున నగర్ లో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.