Sunday, 23 August 2026
  • Home  
  • హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఘన స్వాగతం – జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత*
- తిరుపతి

హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఘన స్వాగతం – జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత*

తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి ప్రజల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి గారికి అందజేశారు. *శ్రీకాళహస్తిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడం, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.* వినతిపత్రాన్ని స్వీకరించిన హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారితో పాటు జనసేన నాయకులు కుమార్ పాల్గొన్నారు.

తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి ప్రజల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి గారికి అందజేశారు. *శ్రీకాళహస్తిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడం, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.*

వినతిపత్రాన్ని స్వీకరించిన హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారితో పాటు జనసేన నాయకులు కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.