సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు ఘన విజయం
సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయి “గ్లాస్ ఇన్ ఇనిస్ట్యూషన్” ఆగష్టు 12 వ తేది జరిగిన పోటీలో మూడవ బహుమతిని సాధించి, విద్యాలయానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతను సాధించాడు.
ఈ పోటీలో ₹10,000 నగదు బహుమతిని 19-09-2026 తేదిన శ్లోక్ గుప్తా అందుకున్నాడు. ఈ పోటీని ఆల్ ఇండియా గ్లాస్ మాను్ఫాక్చరర్స్’ ఫెడరేషన్ (ఎ.ఐ.జీ.యం.యఫ్) నిర్వహించింది.ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపే విషయం ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కె.వి.యస్ )లో విజేతలుగా ఎంపికైన విద్యార్థుల్లో శ్లోక్ గుప్తా ఒక్కరే కె.వి.యస్ తరఫున ఎంపిక కావడం విశేషం.ఈ ప్రతిభ, అంకితభావం సత్తెనపల్లికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలపాలని పాఠశాల ఉపాధ్యాయులు శ్లోక్ గుప్తా కు అభినందనలు తెలిపారు..


