Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

షీలానగర్‌లో ట్రైలర్‌ ప్రమాదం.. కార్మికుడు మృతి రివర్స్‌ చేస్తుండగా ఘటన.. కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
షీలానగర్‌లో ట్రైలర్‌ ప్రమాదం.. కార్మికుడు మృతి రివర్స్‌ చేస్తుండగా ఘటన.. కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు

గాజువాక, అక్టోబర్‌ 17 (పున్నమి ప్రతినిధి): షీలానగర్‌లోని శ్రవణ్‌ షిప్పింగ్‌ పోర్ట్‌ వేర్‌హౌస్‌–3 వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ట్రైలర్‌ ప్రమాదంలో జయదేవ్‌ అనే కార్మికుడు మృతి చెందాడు. ట్రైలర్‌ను రివర్స్‌ చేస్తున్న సమయంలో డ్రైవర్‌ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు విశాఖపట్నానికి బయలుదేరి వస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షీలానగర్‌లో ట్రైలర్‌ ప్రమాదం.. కార్మికుడు మృతి రివర్స్‌ చేస్తుండగా ఘటన.. కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *