ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా AMMA CHEYUTHA FOUNDATION – Hyderabad Old Age Home Centerలో వృద్ధులు, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం వృద్ధులు, చిన్నారులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. జన్మదినాన్ని వృద్ధులు, చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వృద్ధుల ఆశీస్సులు పొందడం, చిన్నారులతో కొంత సమయం గడపడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా మరింత సంతృప్తి లభిస్తుందని, సమాజంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని సురేష్ యాదవ్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


