పున్నమి: హైదరాబాద్, వనస్థలిపురంలో సంప్రదాయానికి, సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన వారాహి సిల్ఫ్ తన 60వ స్టోర్‌ను హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ప్రారంభించనుంది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సినీ నటుడు సూపర్ హీరో తేజ సజ్జ & సినీ నటి మీనాక్షి చౌదరి వారి చేతుల మీదుగా నూతన షోరూమ్ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. రూ.20 వేలకుపైగా ఎంపిక చేసిన విలువైన కొనుగోళ్లపై 100 మిల్లీగ్రాముల బంగారు నాణెం, 5 గ్రాముల వెండి నాణెం ఉ చితంగా అందించనున్నారు. రూ.10 వేలకుపైగా కొనుగోలు చేసిన వారికి 5 గ్రాముల వెండి నాణెం ఇవ్వనున్నారు. మొత్తం సిల్మ్స్ స్టాక్‌పై 15 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు ఆగస్టు 22 నుంచి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.



