Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భైంసాలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్’ 14 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భైంసాలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్’ 14 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం

వార్త ముఖ్యాంశాలు

  • భైంసా:నిర్మల్ జిల్లా ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భైంసాలో బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
  • భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలకు అండగా నిలిచారు.
  • యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, రక్తదానం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

భైంసా:నిర్మల్ జిల్లా ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భైంసాలో బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలకు అండగా నిలిచారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, రక్తదానం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్, బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింధె గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆకుల రంజిత్, అప్పల రాకేష్, కార్యదర్శి స్వరాజ్, కార్యవర్గ సభ్యులు భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *