వార్త ముఖ్యాంశాలు
- పాడేరు: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటు, విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ కె.
- సాహిత్ తెలిపారు.
- పోలీస్, ఫైర్ అధికారులతో కలిసి విక్రయదారులతో సమీక్ష నిర్వహించారు.
పాడేరు: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటు, విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ కె. సాహిత్ తెలిపారు. పోలీస్, ఫైర్ అధికారులతో కలిసి విక్రయదారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అమ్మకాలకు అనుమతి ఉంటుందన్నారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, అగ్నిమాపక ఏర్పాట్లు తప్పనిసరని, ప్రమాదకర బాణసంచా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన