Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి!

వార్త ముఖ్యాంశాలు

  • నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఘటన ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
  • చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
  • ఈ ఘటనలో గ్రామానికి చెందిన కొలకలూరి నిశాంత్ (ఆరవ తరగతి), కండ్లగుంట నాగచైతన్య (ఆరవ తరగతి) మృతి చెందినట్లు సమాచారం.

నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఘటన

ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనలో గ్రామానికి చెందిన కొలకలూరి నిశాంత్ (ఆరవ తరగతి), కండ్లగుంట నాగచైతన్య (ఆరవ తరగతి) మృతి చెందినట్లు సమాచారం. విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.

చిన్న వయస్సులోనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

పున్నమి న్యూస్ విజ్ఞప్తి: పిల్లలు చెరువులు, కాలువలు, ఇతర నీటి ప్రాంతాల వద్దకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈత రాని పిల్లలను నీటిలోకి దిగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
— పున్నమి న్యూస్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *