Thursday, 18 June 2026
  • Home  
  • నెల్లూరు తీరంలో మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్!నెల్లూరు తీరంలో అక్రమ చేపల వేటపై మెరైన్ పోలీసుల చర్యలు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు తీరంలో మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్!నెల్లూరు తీరంలో అక్రమ చేపల వేటపై మెరైన్ పోలీసుల చర్యలు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ పెద్ద బోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ జలాల్లో అక్రమ చేపల వేట కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి, అరికట్టేందుకు మత్స్యశాఖ, మెరైన్ పోలీస్ మరియు అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రెండు మెకనైజ్డ్ బోట్లతో, నిరంతర సముద్ర గస్తీ నిర్వహించబడుతోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు (17.06.2026) సముద్ర గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఇందుకూరుపేట మండల తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రెండు మెకనైజ్డ్ చేపల వేట బోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి, చేపల వేట నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది.వెంటనే మత్స్యశాఖ, మెరైన్ పోలీస్ మరియు అటవీ శాఖల సంయుక్త బృందాలు చర్యలు చేపట్టి ఆ రెండు బోట్లను పట్టుకుని నిర్బంధించాయి. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టుబడిన బోట్లను జువ్వలదిన్నె హార్బర్కు తరలించి మెరైన్ పోలీసు అధికారులకు అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలాల్లో అక్రమ చేపల వేటకు పాల్పడే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని, మత్స్య సంపద పరిరక్షణతో పాటు స్థానిక మత్స్యకారుల హక్కుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.