Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నల్లబెల్లి: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు కలిమి కుమారస్వామి

నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మామిళ్ళ చెరువు నీటి సంఘం మాజీ వైస్ చైర్మన్ కలిమి కుమారస్వామి కాంగ్రేస్ పార్టీ కీ రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ సారంగపాణి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేసే వారికి సరైన గురింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పారపు రాంబాబు, గ్రామ సర్పంచ్ దండం సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *