Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఘనంగా విజయదశమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నూరు గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాలు, సంప్రదాయ పూజా కార్యక్రమాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
  • విజయదశమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

చెన్నూరు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నూరు గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాలు, సంప్రదాయ పూజా కార్యక్రమాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
విజయదశమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. విజయదశమి వేడుకలు భక్తుల సందడి మధ్య ఘనంగా జరిగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *