Saturday, 29 August 2026
  • Home  
  • డబుల్‌ రోడ్డుతో సారపాకకు కొత్త అందాలు
- BHADRADRI

డబుల్‌ రోడ్డుతో సారపాకకు కొత్త అందాలు

సారపాక: సారపాక మేజర్‌ గ్రామపంచాయతీ అభివృద్ధికి కొత్త రూపు రానుంది. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచ్‌ గూగులోత్‌ కిషోర్‌ శివరాం నాయక్‌ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రధాన కూడలి వరకు ఉన్న రహదారిని డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు సెంటర్‌ నుంచి 33 అడుగుల రహదారి, 4 అడుగుల డ్రైనేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో వైపు రహదారి, డ్రైనేజీ కోసం మొత్తం 37 అడుగుల స్థలం అవసరం కానుంది. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న రోడ్డు, డ్రైనేజీ ఆక్రమణలను అధికారులు గుర్తిస్తున్నారు. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు సర్పంచ్‌ కిషోర్‌ శివరాం నాయక్‌ తెలిపారు. సారపాకను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, రహదారులను ఆధునీకరించడంతో పాటు ఇకపై రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డబుల్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రధాన రహదారి రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులతో సారపాక మరింత సుందరంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సారపాక: సారపాక మేజర్‌ గ్రామపంచాయతీ అభివృద్ధికి కొత్త రూపు రానుంది. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచ్‌ గూగులోత్‌ కిషోర్‌ శివరాం నాయక్‌ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రధాన కూడలి వరకు ఉన్న రహదారిని డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.
రోడ్డు సెంటర్‌ నుంచి 33 అడుగుల రహదారి, 4 అడుగుల డ్రైనేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో వైపు రహదారి, డ్రైనేజీ కోసం మొత్తం 37 అడుగుల స్థలం అవసరం కానుంది. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న రోడ్డు, డ్రైనేజీ ఆక్రమణలను అధికారులు గుర్తిస్తున్నారు.
రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు సర్పంచ్‌ కిషోర్‌ శివరాం నాయక్‌ తెలిపారు. సారపాకను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, రహదారులను ఆధునీకరించడంతో పాటు ఇకపై రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డబుల్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రధాన రహదారి రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులతో సారపాక మరింత సుందరంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.