వార్త ముఖ్యాంశాలు
- జోరు వర్షంలోనూ కొనసాగిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారం!
- పలమనేరు, అక్టోబర్ 22, పున్నమి ప్రతినిధి : పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం ఊపందుకుంది.
- మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.
జోరు వర్షంలోనూ కొనసాగిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారం!
పలమనేరు, అక్టోబర్ 22, పున్నమి ప్రతినిధి :
పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం ఊపందుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. వాతావరణం అనుకూలించకపోయినా, కురుస్తున్న జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె శ్రేణులతో కలిసి ముందుకు సాగారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధిను ప్రజలకు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.
వర్షంలోనూ కార్యకర్తలు చూపిన ఉత్సాహం, ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన పార్టీ విజయంపై ధీమాను పెంచిందని నాయకులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలమనేరు పట్టణ మాజీ తెలుగుదేశం అధ్యక్షులు సుధీర్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నదీమ్, నాయకుడు నరేష్, రామూర్తి, మార్క్, రఫీలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని జయప్రదం చేశారు.