వార్త ముఖ్యాంశాలు
- మేడ్చల్ (పున్నమి రిపోర్టర్, సందీప్): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.
- ఈ సందర్భంగా పాదయాత్ర ప్రారంభమైన మొదటి రోజే, అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ (Phase-2) చైర్మన్ రజిని శ్రీహరి గౌడ్ నేతృత్వంలో 2BHK లబ్ధిదారులు ఎంపీ ఈటల రాజేందర్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
- డంపింగ్ యార్డ్‌తో తీవ్ర అస్వస్థత డంపింగ్ యార్డ్ వల్ల ఇళ్ల సమీపంలో ఎదురవుతున్న తీవ్ర దుర్వాసన, రసాయన వ్యర్థాలు, మరియు వాయు కాలుష్యం కారణంగా లబ్ధిదారులు అనుభవిస్తున్న నరకయాతనను వినతిపత్రంలో వివరించారు.
మేడ్చల్ (పున్నమి రిపోర్టర్, సందీప్):
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా పాదయాత్ర ప్రారంభమైన మొదటి రోజే, అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ (Phase-2) చైర్మన్ రజిని శ్రీహరి గౌడ్ నేతృత్వంలో 2BHK లబ్ధిదారులు ఎంపీ ఈటల రాజేందర్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
డంపింగ్ యార్డ్‌తో తీవ్ర అస్వస్థత
డంపింగ్ యార్డ్ వల్ల ఇళ్ల సమీపంలో ఎదురవుతున్న తీవ్ర దుర్వాసన, రసాయన వ్యర్థాలు, మరియు వాయు కాలుష్యం కారణంగా లబ్ధిదారులు అనుభవిస్తున్న నరకయాతనను వినతిపత్రంలో వివరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారానికి కలిసి పోరాడదాం: ఎంపీ ఈటల రాజేందర్
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ — “జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా డబుల్ బెడ్రూమ్ నివాసితులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ఈ ప్రజా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదు. మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.
పాదయాత్రలో పాల్గొనాలని లబ్ధిదారులకు పిలుపు
ఈ కార్యక్రమంలో భాగస్వాములైన లబ్ధిదారులు, తమ ప్రాంతాన్ని కాలుష్య రహితంగా మార్చుకునేందుకు జరిగే ఈ పాదయాత్రలో 2BHK నివాసితులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చైర్మన్ రజిని శ్రీహరి గౌడ్ కోరారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్