Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

“జనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో రవిశంకర్‌కు చోటు”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“జనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో రవిశంకర్‌కు చోటు”

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలోని నిర్వాహక దళ్ సభ్యునిగా సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అవ్వారు రవి శంకర్‌కు స్థానం లభించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అవ్వారు రవి శంకర్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకు రాజకీయాల్లో తగిన ప్రోత్సాహం అందిస్తూ, వారి నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా బడుగు, బలహీన వర్గాలకు కూటమి పార్టీల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ సిద్ధాంతాల అమలుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.తనపై నమ్మకంతో కమిటీలో స్థానం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు, అతికారి కృష్ణకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. తనతో పాటు స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా నియమితులైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

“జనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో రవిశంకర్‌కు చోటు”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *