“గురుదేవో నమోనమః”
నీ గమ్యం ఏదైనా గురువే కదరా వారధి
నీ గమనం ఏదైనా గురువే కదరా సారధి
బ్రతుకున బాసటగా నిలిచే
ఓ సైన్యం
బరిలో గెలుపుకై
నిలిచే ఓ ధైర్యం
గుడిలో దేవుడి కన్నా
బడిలో గురువే మిన్న
అలుముకున్న అజ్ఞాన చీకటిని చీల్చే కిరణం
ఈ గురువు అంటే
గురుబ్రహ్మ గురువిష్ణు
గురుదేవో నమోనమః
నీ గమ్యం ఏదైనా
గురువే కదరా వారధి
నీ గమనం ఏదైనా
గురువే కదరా సారధి..
…….
కీర్తించిన ప్రతి ఘనత వెనుక
ఎగిరే పతాకపు రెపరెపలే
గురువు అంటే
సాధించిన ప్రతి ఘనుడు వెనుక
మెడలో స్వర్ణమాలలే
గురువు అంటే
అనుసరించితే నీ గురువును
అభివృద్ధి వైపు నడిపించును
తలవంచితే నీ గురువుకు
తలదించదు నీ బ్రతుకు
గురుబ్రహ్మ గురువిష్ణు
గురుదేవో నమో నమః
… నీ గమ్యం ఏదైనా
గురువే కదరా వారధి
నీ గమనం ఏదైనా
గురువే కదరా సారధి..
..
తరలివచ్చిన గత తరముల వెనుక
రాజ్య రక్షణ విజ్ఞానమే
గురువు అంటే
తరలిపోయే నవ శకానికైనా
బోధించే అధ్యాపకుడే
గురువు అంటే
శరణు గోరితే నీ గురువును
శిఖరం చేర్చు నీ ప్రతిభను
గౌరవించితే నీ గురువును
విజయతీరం దాటించును
గురుబ్రహ్మ గురువిష్ణు
గురుదేవో నమోనమః
…. నీ గమ్యం ఏదైనా గురువే కదరా వారధి
నీ గమనం ఏదైనా గురువే కదరా సారధి
తిరుమల నాగేంద్ర కుమార్
ప్రాథమిక పాఠశాల,మల్లారెడ్డి పల్లి
నవాబ్ పేట్ మండలం
మహబూబ్ నగర్ జిల్లా.


