Saturday, 15 August 2026
  • Home  
  • కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్
- మేడ్చల్ – మల్కాజిగిరి

కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్

### కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ ### వాకర్లతో ముఖాముఖి నిర్వహించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు **హైదరాబాద్, ఆగస్టు 14:** కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్‌వే ట్రాఫిక్ విధానంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం పార్క్ వాకర్లతో ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డీసీపీ-2 కాజల్, ఐపీఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ బేల్స్, మల్టీ లెవల్ పార్కింగ్‌లోనే నిలపాలని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపవద్దని సూచించారు. కొత్త నిబంధనల అమలులో ట్రాఫిక్ పోలీసులకు వాకర్లు, వాహనదారులు సహకరించాలని కోరారు. వాకర్ల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేబీఆర్ పార్క్ వద్ద QR కోడ్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

### కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్

### వాకర్లతో ముఖాముఖి నిర్వహించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

**హైదరాబాద్, ఆగస్టు 14:** కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్‌వే ట్రాఫిక్ విధానంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం పార్క్ వాకర్లతో ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డీసీపీ-2 కాజల్, ఐపీఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ బేల్స్, మల్టీ లెవల్ పార్కింగ్‌లోనే నిలపాలని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపవద్దని సూచించారు. కొత్త నిబంధనల అమలులో ట్రాఫిక్ పోలీసులకు వాకర్లు, వాహనదారులు సహకరించాలని కోరారు.

వాకర్ల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేబీఆర్ పార్క్ వద్ద QR కోడ్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.