Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఉపసంహరణలో నిల్‌.. ఆత్మకూరు పోరులో ఉత్కంఠ!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపసంహరణలో నిల్‌.. ఆత్మకూరు పోరులో ఉత్కంఠ!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్‌ 20 (కోటకొండ హరికిరణ్‌, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తొలి రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
  • అక్టోబర్‌ 20న చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒక్కరు కూడా తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని ఎన్నికల అధికారుల నివేదిక వెల్లడించింది.అధికారిక ఉపసంహరణల నివేదిక ప్రకారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ఎలాంటి ఉపసంహరణలు నమోదు కాలేదు.
  • దీంతో చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఉపసంహరణల సంఖ్య సున్నాగానే నమోదైంది.అక్టోబర్‌ 21న ఉపసంహరణలకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

తొలి రోజు చైర్‌పర్సన్‌ అభ్యర్థుల నుంచి ఉపసంహరణలు సున్నా

రేపటి పరిణామాలపై రాజకీయ పార్టీల దృష్టి

ఆత్మకూరు, అక్టోబర్‌ 20 (కోటకొండ హరికిరణ్‌, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తొలి రోజు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అక్టోబర్‌ 20న చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒక్కరు కూడా తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని ఎన్నికల అధికారుల నివేదిక వెల్లడించింది.అధికారిక ఉపసంహరణల నివేదిక ప్రకారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ఎలాంటి ఉపసంహరణలు నమోదు కాలేదు. దీంతో చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఉపసంహరణల సంఖ్య సున్నాగానే నమోదైంది.అక్టోబర్‌ 21న ఉపసంహరణలకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. రెండో రోజు ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారు? ఎంతమంది బరిలో కొనసాగుతారు? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపసంహరణల గడువు ముగిసిన అనంతరం చైర్‌పర్సన్‌ పదవికి పోటీలో నిలిచే అభ్యర్థుల తుది సంఖ్యపై స్పష్టత రానుంది.కాగా, ఈ నివేదిక చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఉపసంహరణలకు సంబంధించినది మాత్రమే. 28 వార్డుల్లో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థుల ఉపసంహరణల వివరాలు ఇందులో లేవు. వాటికి సంబంధించిన అధికారిక వివరాలు అందిన తర్వాతే వార్డుల వారీగా పోటీ పరిస్థితిపై స్పష్టత రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *