Tuesday, 15 September 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *పాఠశాల విద్యాశాఖ – సమగ్రశిక్ష పత్రికా ప్రకటన.
- తూర్పు గోదావరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *పాఠశాల విద్యాశాఖ – సమగ్రశిక్ష పత్రికా ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *పాఠశాల విద్యాశాఖ – సమగ్రశిక్ష పత్రికా ప్రకటన. *పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదల తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 15 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 29న ఎన్నికలు • సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన “SMC మార్గదర్శకాలు – 2026” ఆధారంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలు • 15.09.2026: SMC సభ్యులు, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల (ఉదయం 10:00 గంటలకు). • 18.09.2026: పాఠశాల నోటీస్ బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన (మధ్యాహ్నం 2:00 గంటలకు). • 25.09.2026: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం (ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు). o తుది ఓటర్ల జాబితా ఖరారు, ప్రదర్శన (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:00 వరకు). • 29.09.2026: SMC సభ్యుల ఎన్నిక నిర్వహణ, ఖరారు (ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు). o ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక (మధ్యాహ్నం 1:30 గంటలకు). o ప్రమాణ స్వీకారోత్సవం (మధ్యాహ్నం 2:00 గంటలకు). o నూతన SMC మొదటి సమావేశం (మధ్యాహ్నం 3:00 నుండి 3:30 వరకు). ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఆయా జిల్లాల ప్రాంతీయ విద్యా శాఖ సంయుక్త సంచాలకులు (RJDSEs), జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs), సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు (APCs) తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఆదేశించారు. డిప్యూటీ ఈఓలు, సెక్టోరల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలకు సమాచారం అందిస్తూ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. పాఠశాలల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం కోసం ప్రైవేట్ పాఠశాలలు కూడా SMCలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
*పాఠశాల విద్యాశాఖ – సమగ్రశిక్ష
పత్రికా ప్రకటన.

*పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 15

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 29న ఎన్నికలు
• సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన “SMC మార్గదర్శకాలు – 2026” ఆధారంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు
• 15.09.2026: SMC సభ్యులు, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల (ఉదయం 10:00 గంటలకు).
• 18.09.2026: పాఠశాల నోటీస్ బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన (మధ్యాహ్నం 2:00 గంటలకు).
• 25.09.2026: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం (ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు).
o తుది ఓటర్ల జాబితా ఖరారు, ప్రదర్శన (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:00 వరకు).
• 29.09.2026: SMC సభ్యుల ఎన్నిక నిర్వహణ, ఖరారు (ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు).
o ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక (మధ్యాహ్నం 1:30 గంటలకు).
o ప్రమాణ స్వీకారోత్సవం (మధ్యాహ్నం 2:00 గంటలకు).
o నూతన SMC మొదటి సమావేశం (మధ్యాహ్నం 3:00 నుండి 3:30 వరకు).
ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఆయా జిల్లాల ప్రాంతీయ విద్యా శాఖ సంయుక్త సంచాలకులు (RJDSEs), జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs), సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు (APCs) తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఆదేశించారు. డిప్యూటీ ఈఓలు, సెక్టోరల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలకు సమాచారం అందిస్తూ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. పాఠశాలల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం కోసం ప్రైవేట్ పాఠశాలలు కూడా SMCలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.