Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

అర్నబ్ తుఫానుపై అప్రమత్తం.. అధికారుల సమన్వయ సమావేశం భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్నబ్ తుఫానుపై అప్రమత్తం.. అధికారుల సమన్వయ సమావేశం భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ

గాజువాక, అక్టోబర్ 26 (పున్నమి ప్రతినిధి):

అర్నబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో గాజువాకలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం గాజువాక మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

తుఫాను ప్రత్యేక అధికారి, జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, తహసీల్దార్ త్రినాథ్, గాజువాక ఎస్‌ఐ రామకృష్ణ, దువ్వాడ ఎస్‌ఐ వెంకట్ లక్ష్మితో పాటు రెవెన్యూ, జీవీఎంసీ, ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

తుఫానుకు ముందు, సమయంలో, అనంతరం చేపట్టాల్సిన చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయం, బాధితులకు సహాయక చర్యలు అందించడం వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని, భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు.

అర్నబ్ తుఫానుపై అప్రమత్తం.. అధికారుల సమన్వయ సమావేశం భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ

అర్నబ్ తుఫానుపై అప్రమత్తం.. అధికారుల సమన్వయ సమావేశం భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *